దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్​ డ్రై రన్​

వ్యాక్సిన్​ పంపిణీ కోసం చర్యలు ముమ్మరం

Corona vaccine dry run nationwide
Corona vaccine dry run nationwide

New Delhi: కరోనా వ్యాక్సిన్​ పంపిణీకి ముందు శుక్రవారం మరోసారి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం డ్రై రన్​ నిర్వహిస్తోంది. 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ డ్రై రన్​ జరగనుంది. ఇందు కోసం ఆయా ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేపట్టాయి.

డ్రై రన్​పై గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశమై మార్గనిర్దేశం చేశారు . దేశంలో కరోనా వ్యాక్సిన్​ పంపిణీ కోసం చర్యలు ముమ్మరం చేసింది . టీకా పంపిణీలో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేసేందుకు ఇప్పటికే ఓసారి డ్రై రన్​ నిర్వహించగా.. శుక్రవారం మరోమారు దేశవ్యాప్తంగా టీకా డ్రై రన్​ నిర్వహిస్తోంది.

ఉత్తర్​ప్రదేశ్​, హరియాణా రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ డ్రై రన్​ జరగనుంది. ఇందు కోసం ఆయా ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.

736 జిల్లాల్లో…

దేశవ్యాప్తంగా మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 736 జిల్లాల్లో ఈ డ్రై రన్​ చేపడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నెల 2న తొలివిడత డ్రై రన్​లో మొత్తం 125 జిల్లాలలో నిర్వహించారు.

ప్రత్యేక దృష్టి పెట్టాలి..

దేశవ్యాప్తంగా రెండో దఫా వ్యాక్సిన్​ మాక్​ డ్రిల్ నేపథ్యంలో గురువారం అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, అదనపు చీఫ్​ సెక్రటరీలతో వీడియోకాన్ఫరెన్స్​ ద్వారా సమావేశమయ్యారు.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​. టీకా డ్రై రన్​ విజయవంతం చేసేందుకు కృషి చేయాలని, వ్యక్తిగతంగా రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

కొవిడ్​-19 వ్యాక్సిన్​ భద్రత, సామర్థ్యంపై పుకార్లు, తప్పుడు ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/