సౌరవ్ గంగూలీకి కరోనా నిర్ధారణ
స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయన్న వైద్యులు
sourav-ganguly-tests-positive-for-covid
ముంబయి : బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా సోకింది. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురి కావడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆయన ప్రస్తుతం కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బీసీసీఐ వర్గాలు మీడియాకు తెలిపాయి.
ఆయనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని వైద్యులు తెలిపారు. గతంలో గంగూలీ కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడ్డారు. కాగా, ఈ ఏడాది జనవరిలో గంగూలీ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయనకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేసి అనంతరం డిశ్చార్జ్ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/