ఢిల్లీని దట్టమైన పొగమంచు..110 విమానాలు, 25 రైళ్ల ఆలస్యం

జీరో స్థాయికి పడిపోయిన విజిబిలిటీ

110 flights, 25 trains affected as dense fog blankets Delhi, visibility near zero

న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కప్పేసింది. నగరంపై దుప్పటిలా పరుచుకున్న మంచు కారణంగా కళ్లు చించుకున్నా దారి కనబడడం లేదు. విజిబిలిటీ జీరో స్థాయికి పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు దట్టంగా పరుచుకోవడంతో ఢిల్లీ విమానాశ్రయంలో దాదాపు 110 విమాన రాకపోకలపై ప్రభావం చూపింది. అలాగే, 25 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

మరోవైపు, మంచు కౌగిలిలో నలిగిపోతున్న ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలకు పడిపోయాయి. ఢిల్లీ మాత్రమే కాదు, ఉత్తర భారతదేశం మొత్తం ఇదే పరిస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో చలిగాలులు భయపెడుతున్నాయి. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి.