ఏపీ డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు

Chandrababu Tour Program in Kuppam
tdp-chief-chandrababu

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు మాచర్లలో జల్లయ్య హత్య, పోలీసుల వైఖరిపై డీజీపీకి లేఖ రాశారు. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా పోలీసులే జల్లయ్య మృతదేహాన్ని బలవంతంగా రావులాపురం తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను సైతం బలవంతంగా బస్సుల్లో తీసుకెళ్లడం దుర్మార్గమన్నారు. పార్టీ కార్యకర్త జల్లయ్య అంత్యక్రియలకు వెళ్లకుండా ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు, టీడీపీ బృందాన్ని పోలీసులు అరెస్టులతో అమానవీయంగా అడ్డుకున్నారన్నారు. జల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు టీడీపీ నేతలు, అతని బంధువులను అనుమతించాలని డిమాండ్‌ చేశారు.

అసలు.. పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించి ఉంటే ఈ హత్యే జరిగేది కాదన్నారు చంద్రబాబు. 2019 తర్వాత ఒక్క మాచర్లలోనే ఐదుగురు బీసీ వర్గం వారిని హత్య చేశారన్నారు. అందులో నలుగురు యాదవ సామాజిక వర్గం వారే ఉన్నారని తెలిపారు. పోలీసుల మద్దతుతో వైస్సార్సీపీ వరుస హత్యలతో టీడీపీ మద్దతుదారులను భయపెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. మాచర్లలో బీసీ వర్గంపై జరుగుతున్న హత్యాకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేయ్యాలన్నారు. హంతకులకు మరణశిక్ష విధించేలా పోలీసు శాఖ చర్యలు ఉండాలని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/