కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ఈసీకి ఫిర్యాదు చేసిన టిఆర్ఎస్ నేతలు

మునుగోడు ఉప ఎన్నిక బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ ఫై ఈసీకి ఫిర్యాదు చేసారు టిఆర్ఎస్ నేతలు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్టి తాను రూ.18 వేల కోట్ల ప్రాజెక్టు తీసుకొని బీజేపీలో చేరానని ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారని. అందుకని రాజగోపాల్ రెడ్డిని అసెంబ్లీ బైపోల్‌లో పోటీ చేయకుండా అనర్హుడిని చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి మెమోరాండం సమర్పించారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌.

ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అవహేళన చేసే చర్య అని, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్‌ను గాలికి వదిలేశారని విమర్శించారు. ఇచ్చి పుచ్చుకోవడం కింద ఇలాంటి పనులు చేసారని ఎన్నికల ప్రధాన అధికారికి విన్నవించామని చెప్పారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి రాజగోపాల్ రెడ్డిని మునుగొడులో పోటీ చేయకుండా డిస్‌క్వాలిఫై చేయాలని ఆయన ఈసీని కోరారు. కాంట్రాక్ట్‌లలో వచ్చిన డబ్బు సంచులతో మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల అధికారిని కలిసిన వారిలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌, పార్టీ జనరల్‌ సెక్రటరీలు శ్రీనివాస్‌రెడ్డి, సోమ భరత్‌ ఉన్నారు.