ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

voice of the peple-
voice of the peple-


లంచగొండిదారులకు కళ్లెం వేయాలి: -పూసాల సత్యనారాయణ, హైదరాబాద్‌

ప్రభుత్వం కొత్త చట్టాలు తెచ్చినా కొరడాలు ఝుళిపించలేక పోతున్నారు. ఎసిబివాళ్లు వల వేసి పట్టుకొని జైలులో పెట్టినా లంచగొండి అధికారులలో ఆవగింజంత మార్పురాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.వారిలో చలనం ఎంతమాత్రం లేదు. వినూత్నమైన రీతిలో వాట్సాప్‌ ద్వారా ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేసే సదుపాయం ప్రజానీకానికి కల్పిస్తే సత్వర చర్యలు చేపట్టవచ్చు. సిబ్బంది అందరికి వణుకు పుడుతుంది. ప్రతిప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో ఎసిబి అధికారులు కానీ, సంబంధిత ఉన్నత అధికారులు కాని ఆకర్షణీయమైన డిజైన్‌తోబోర్డులు ఏర్పాటు చేయాలి. అందులో ఎసిబి అధికారి వాట్సాప్‌ నెంబర్‌ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే అవినీతి అధికారుల భరతం పట్టి వాటి మూలాలను కూకటివేళ్లతో పెకి లించవచ్చు.ప్రజల్లో చైతన్యంతేవచ్చు.చట్టానికి చుట్టాలు ప్రజా ప్రతినిధులుకారు. నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా చర్యలు తీసుకోవాలి.అప్పుడేప్రజలకున్యాయంచేకూర్చిన వాళ్లమవ్ఞతాం.

యధాతథంగా ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి: -యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలి వేతన సవరణలో ప్రభుత్వ ఉద్యోగులకు నలభైమూడు శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం పిఆర్‌సిలో కేవలం ఏడున్నర శాతమే ఇస్తాననటం, గత మూడేళ్లుగా కరవ్ఞ భత్యం చెల్లించక, ఇంటి అద్దె కుదింపు, ఆరేళ్లుగా పదవీ విరమణ వయోపరిమితి పెంపు ఊరింపు వంటివి ఉద్యోగుల బొచ్చెలో రాయి వేసేదిగా ఉంది.నిత్యావసరపెట్రోధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అమా త్యుల వేతనాలు, పింఛన్లు రెట్టింపు చేసుకుంటున్న పాలకులు ప్రభుత్వ పథకాలను ప్రజల ముందుకు చేర్చే ఉద్యోగుల రాయితీలపై మీనమేషాలు లెక్కించడం సరికాదు. ధరలు, గత పిఆర్‌సి అమాత్యుల వేతనాలు పరిగణనలోకి తీసుకుని కనీసం యాభైశాతం ఫిట్‌మెంట్‌ యధాతథంగా ఇంటి అద్దె చెల్లించేం దుకు ప్రభుత్వం ముందుకు రావాలి.

రాజ్యాంగాన్ని డిజటలైజేషన్‌ చేయాలి: -డి.చాంద్‌బాషా, కర్నూలు

మేధావులు ఎన్నో సంవత్సరాల తరబడి కష్టపడి రచించిన భారత రాజ్యాంగం భద్రమేనా?ప్రస్తుతం పాత రాజ్యాంగంలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.కావున రాజ్యాంగ ప్రతు లను కొత్తగా ముద్రించి భద్రపరిస్తే బాగుంటుంది. భారత రాజ్యాంగాన్ని పురాతన వస్తువ్ఞగా చూడకుండా దాన్ని డిజటలై జేషన్‌ చేస్తే ముందుతరాలకు బాగుంటుంది.

రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి:-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

అవినీతి, అనైతికతతో భ్రష్టుపట్టిపోయిన మనరాజకీయ వ్యవస్థ ను ప్రక్షాళనం చేసేందుకు యువత పెద్దఎత్తున కదిలిరావాలి. తొలుత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వంద శాతం వినియోగించుకొని అవినీతిపరులను ఎన్నికలలో చిత్తుగా ఓడిం చాలి. రాజకీయాలలో మోసం, దౌర్జన్యం, హింస, హత్య రాజ కీయాలతోపాటు న్యాయస్థానాలలో తీవ్ర అభిశంసన, అభియో గాలు ఎదుర్కొంటున్న నేరచరితులదే రాజ్యంగా నడుస్తోంది. మద్యం, ధనం ఏరులైపారించి, ప్రజలను మభ్యపెట్టి అధికారం చేజిక్కించుకుంటున్నారు. ప్రజల హక్కులను కాలరాస్తూ ప్రజా ధనాన్నివిశృంఖలంగా దోచుకుంటున్నారు. ఇటువంటి నిరంకుశ నేతలకు బుద్దిచెప్పేందుకు యువతపెద్దఎత్తున రాజకీయాలలోకి కదిలిరావాలి.యువరక్తంవలన నేటిరాజకీయాల ప్రక్షాళన సాధ్య మన్ననిజాన్నిపార్టీలుసైతం ఎంతత్వరగా గుర్తిస్తేఅంత మంచిది.

పాఠశాల ఫీజులను తగ్గించాలి: -ఎం.కనకదుర్గ, తెనాలి, గుంటూరుజిల్ల్లా

కంద్రప్రభుత్వం రూపొందించిన నూతన విద్యావిధానంలో ఫీజుల పరిమితి నిర్దేశించడం ముదావహం. నిర్దేశిత ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేసే విద్యాసంస్థలపై క్రిమినల్‌ కేసులు పెట్టేలా చట్టసవరణలు తీసుకురావాలి.ఇక జిడిపిలో ఆరుశాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలన్న ప్రతిపాదన హర్షణీ యం. ఇందువలన విద్యాసంస్థలలో నాణ్యతా, పరిశోధనలు, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకునేందుకు అవకాశం ఎంతైనా ఉంటుంది. అన్ని కాలేజీలలో లిటరేచర్‌, సంగీతం, తత్వశాస్త్రం, థియేటర్‌, గణితం, సోషియాలజీ, వంటి విభాగా లను ఏర్పాటు చేయడంలో విద్యార్థులు తమకు అభిరుచి ఉన్న వివిధ రంగాలలో ఉన్నత విద్య చేపట్టవచ్చు.

టెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలి : -రావుల రామ్మోహన్‌ రెడ్డి, వరంగల్‌

తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నోటిఫికేషన్‌ జారీ చేసి పరీక్ష నిర్వహించాలి. ఈ పరీక్ష కోసం నాలుగు లక్షల మంది డి.ఎడ్‌, బి.ఎడ్‌ అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా టెట్‌ నోటిఫికేషన్‌ కోసం అభ్యర్థులు నిరీక్షణ చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉపా ధ్యాయునిగా బోధనకు టెట్‌ తప్పనిసరి కాబట్టి ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేయాలి. అలాగే టీచర్‌పోస్టులు కూడా మెగా టిఆర్టీ ద్వారా భర్తీ చేయాలి.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/