తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తా..షర్మిల

తెలంగాణలో రాజన్న లేని లోటు క్లియర్ గా కనిపిస్తోందన్న షర్మిల

హైదరాబాద్‌: వైఎస్‌ షర్మిల లోటస్‌ పాండ్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ముఖ్య నేతలతో సమావేశం ముగిసిని అనంతరం షర్మిల మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్ ‌లేని లోటు తెలంగాణలో ఉంది. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు. ఎందుకు అలా లేదన్నదే నా ఆలోచన. నేను ఎందుకు రాకూడదు.. ఎందుకు పార్టీ పెట్టకూడదు. అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాను. కచ్చితంగా తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తాం. అభిమానులకు చెప్పకుండా నేను పార్టీ పెట్టను. అందరితోనూ మాట్లాడే నా నిర్ణయాన్ని ప్రకటిస్తాను అని షర్మిల చెప్పారు. అయితే పార్టీ పేరు ఏంటో చెప్పండి అని షర్మిలను అడగ్గా సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెబుతానంటూ సమావేశానికి ఆమె వెళ్లిపోయారు. కాస్త ఓపికగా ఉండండి అన్ని వివరాలు చెబుతానని మీడియాకు షర్మిల చెప్పారు. గ్రౌండ్ రియాల్టీ ఏమిటనే విషయం తెలుసుకోవడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణలో ప్రతి ఇంటికి వెళ్తానని చెప్పారు.

మరోవైపు కొత్త పార్టీపై కార్యకర్తలకు ఆమె దిశానిర్దేశం చేయబోతున్నారు. రానున్న 30 రోజులు పార్టీ నిర్మాణంపై దృష్టిని సారించనున్నట్టు తెలుస్తోంది. పార్టీ ప్రకటన కోసం భారీ బహిరంగసభను నిర్వహించే అవకాశం ఉంది. వైఎస్‌ఆర్, తెలంగాణ పేర్లు కలిసి వచ్చేలా పార్టీ పేరు ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. 100 నియోజకవర్గాల్లో 16 నెలల పాటు పాదయాత్ర చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Image result for ys-sharmila-meeting-at-lotuspond