శ్రీనివాస్ గౌడ్ చిట్టా చాలా ఉంది..

Jagga Reddy , CM KCR , Singur Water ,

హైదరాబాద్‌: మంత్రి ఈటెల దగ్గర ఆరోగ్య శాఖ మాత్రమే ఉంది.. పవర్‌ అంతా సిఎం దగ్గరే ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కరోనా కేవలం హైదరాబాద్ కే పరిమితం అనుకున్నారు.. కానీ ఇప్పుడు జిల్లాలకు వ్యాప్తి చెందిందని ఆయన అన్నారు. ఈటెల కేవలం కరోనా కేసుల బులిటెన్ విడుదలకే పరిమితం అయ్యారని చెప్పారు. హైకోర్టు అంటే కూడా ప్రభుత్వానికి లెక్కలేదన్నారు. తెలంగాణలో అభివృద్ధి కాదు.. కరోనా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తన పార్టీ అధికారంలో ఉంటే… ఆరోగ్య మంత్రిని సంగారెడ్డి ఆసుపత్రిలో పడుకో బెట్టే వాడినన్నారు. తాను తిట్టింది మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని కానీ..ఆయన కులాన్ని కాదన్నారు. శ్రీనివాస్ గౌడ్ చిట్టా చాలా ఉందన్నారు. గౌడ సంగం నాయకులకు శ్రీనివాస్ గౌడ్ చరిత్ర అర్థం అయ్యేలా చెప్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/