చిరంజీవి పేరు మార్పు..అసలు క్లారిటీ ఇదే..

మెగాస్టార్ చిరంజీవి పేరు మార్చుకున్నారా..? ప్రస్తుతం ఇదే చిత్రసీమలో హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే తాజాగా ఆయన పేరులో కొత్త ఆంక్షరం వచ్చి చేరింది. చిత్రసీమలో సెంటిమెంట్ ను ఎక్కువగా నమ్ముతుంటారు. ముఖ్యంగా పేరులో పలు మార్పులు చేసుకుంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం చేస్తుంటారు. తాజాగా చిరంజీవి కూడా అదే చేసారని అంటున్నారు.

ఇప్పటి వరకు ఇంగ్లీషులో చిరంజీవి పేరు ‘CHIRANJEEVI’ అని ఉండేది. ఇప్పుడు దీనికి మరో ‘E’ జతచేసి… ‘CHIRANJEEEVI’ అని మార్చుకున్నారు. చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో ‘Megastar Chiranjeevi’ అని ఉండాల్సిన పేరులో ‘Megastar Chiranjeeevi’గా ఉంది. ఒక న్యూమరాలజిస్ట్ సలహా మేరకు చిరు ఈ మార్పు చేసుకున్నారని చెపుతున్నారు. ఈ పేరు మార్పు వెనకాల న్యూమరాలజిస్టుల సలహా ఉందని, అందుకే చిరంజీవి పేరు మార్చుకున్నట్లు నెట్టింట వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే ఈ వార్తలను చిరంజీవి సన్నిహితులు, గాడ్‌ ఫాదర్‌ చిత్రబృందం ఖండించారు. గాడ్‌ ఫాదర్‌ మూవీ యూనిట్‌ ఎడిటింగ్‌ చేసేటప్పుడు జరిగిన తప్పు మాత్రమే అని, చిరంజీవి ఎలాంటి పేరు మార్చుకులేదని చెబుతున్నారు. ఎడిటింగ్‌ తప్పిదం వల్లే అదనంగా ఇంకో E అక్షరం యాడ్‌ అయిందే తప్ప న్యూమరాలజిస్ట్‌ల సలహా అస్సలు తీసుకోలేదని తెలిపారు. అలాగే మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని మేకర్స్ పేర్కొంది.

గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి – మోహన్ రాజా కలయికలో గాడ్ ఫాదర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ రీమెక్ ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా రాబోతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. షూటింగ్ చివరి దశకు చేరుకోవడం తో మేకర్స్ ప్రమోషన్ ఫై దృష్టి పెంచారు. ఈ తరుణంలో సినిమా తాలూకా ఫస్ట్ లుక్కా టీజర్ ను సోమవారం సాయంత్రం విడుదల చేసి అభిమానుల్లో సంబరాలు నింపారు.