చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ వల్లే 8 మంది ప్రాణాలు పోయాయి – కొడాలి నాని

కందుకూరు టీడీపీ సభలో జరిగిన తొక్కిసలాట కారణంగా 8 మంది ప్రాణాలు పోయాయి. మరికొంతమంది తీవ్రంగా గాయపడడం తో హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటన ఫై వైస్సార్సీపీ నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గోదావరి పుష్కరాల సమయంలో కూడా 29మంది ప్రాణాలను మరణానికి కారణమయ్యారన్నారు. డ్రోన్ షాట్ల కోసం జనాలు బలవంతంగా తరలించి సభ పెట్టారన్నారు.

జగన్ సభలకు అంతమంది జనాలు వచ్చినా చిన్న ఘటన కూడా జరగలేదన్నారు. చంద్రబాబు ఇంకా ఒకసారి అవకాశం ఇవ్వమని అడుగుతుంటే ఎంత దిగజారరో అర్ధమవుతుందన్నారు. ఇవి చంద్రబాబు చేసిన హత్యలని.. ఆయన రాష్ట్రంలో పుట్టడమే ఖర్మ అంటూ ఇప్పటికే పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా…మాజీ మంత్రి , ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ వల్లే 8 మంది ప్రాణాలు పోయాయన్నారు.

ఇరుకు సందుల్లో సభలు వద్దని స్థానిక నాయకులు చెప్పినా వినకుండా పబ్లిసిటీ స్టంట్ కోసం కందుకూరులో చంద్రబాబు సభ నిర్వహించారన్నారు నాని. ఫలితంగా 8 మంది అమాయకులు మృతిచెందారని.. ఇప్పటికైనా ప్రచార పిచ్చి తగ్గించుకో బాబూ అంటూ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.