కెసిఆర్ న్యూట్రిషన్ కిట్టును పంపిణి చేసిన మంత్రి సబిత

Minister Sabita who distributed the KCR nutrition kit

వికారాబాద్ః దేశంలో ఎక్కడా లేని విధంగా గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం పౌష్టికాహారం అందించేలా న్యూట్రీషన్ కిట్లు అందజేస్తున్న ఘనత కెసిఆర్ కే దక్కుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టును ఆవిష్కరించారు. పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిలతో కలిసి గర్భిణీ స్త్రీలకు న్యూట్రీషన్ కిట్లు అందజేశారు. గర్భిణీల్లో రక్తహీనత అరికట్టేందుకు, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేలా న్యూట్రీషన్ కిట్టు రూపకల్పన చేసినట్టు మంత్రి తెలిపారు.

రూ.1,962లతో బలవర్దకమైన పోషకాహారం గర్భిణీలకు రెండు సార్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సబిత తెలిపారు. సర్వే ఆధారంగా రక్తహీనత అధికంగా ఉన్న తొమ్మిది జిల్లాలో మొదట న్యూట్రీషన్ కిట్లు అందజేస్తున్నామని చెప్పారు. తల్లీ, బిడ్డా బాగుండాలి అప్పుడే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. గతంలో కెసిఆర్ కిట్టు, ఇప్పుడు న్యూట్రీషన్ కిట్లు ఇవ్వడం వల్ల మహిళల పట్ల కెసిఆర్‭కు ఉన్న చిత్తశుద్ధి తెలుస్తుందని మంత్రి సబిత చెప్పారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/