పాక్‌ ప్రధానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

pm-modi

న్యూ ఢిల్లీః పాకిస్థాన్ ప్రధానిగా హెహబాజ్ షరీఫ్ ప్రమాణస్వీకారం చేసి, రెండోసారి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా షెహబాజ్ షరీఫ్ కు భారత ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. పాక్ ప్రధానిగా నిన్న ప్రమాణస్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్ కు అభినందనలు అని ఎక్స్ వేదికగా మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఓట్ల రిగ్గింగ్ ఆరోపణలతో పాకిస్థాన్ ఎన్నికలు అసంపూర్తిగా జరిగాయి. ఎన్నికలు జరిగిన నెల తర్వాత పాక్ ప్రధానిగా రెండో సారి షరీఫ్ బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఈ పరిస్థితుల్లో పాక్ ను షెహబాజ్ షరీఫ్ ఎలా గట్టెక్కిస్తారో వేచి చూడాలి.