ధ్యానం ఎక్కడైనా!

ఆరోగ్య చిట్కాలు:

Meditation
Meditation


ఒత్తిడిలో ఉన్నప్పుడు కాసేపు ధ్యానం చేస్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలిసిందే. ఉదయం మాత్రమే కాకుండా సమయం చిక్కిన్నప్పుడు ఎక్కడైనా ధ్యానం చేయవచ్చు.

ఆఫీసులో ..

లంచ్‌ తరువాత బ్రేక్‌లో మీరు కూర్చున చోటనే ధ్యానం చేయొచ్చు. కుర్చీలో వెనక్కి, నిటారుగా కూర్చొవాలి. మోకాళ్లు 80 డిగ్రీల కోసంలో ఉండాలి. తల, మెడ వెన్నుపూస నిటారుగా ఉండేలా చేసుకోవాలి. ఇప్పుడు చేతుల్లిన నడుముకు ఇరువైపులా ఉంచాలి. ఈ ధ్యానంతో
ఆలోచనలు అందుపులో ఉంటాయి.

నిల్చొని :

నిటారుగా నిల్చొని కాళ్లను కొద్దిగా దూరంగా పెట్టాలి. ఇప్పుడు మెకాళ్లను కొద్దిగా ముందుకు వంచి గట్టిగా శ్వాస తీసుకోవాలి. చేతుల్ని పొట్ట మీద ఉంచితే శ్వాసలోని రిథమ్‌ తెలుస్తుంది. ఇలా కొంచెం సమయం చేస్తే రిలీఫ్‌గా ఉంటుంది.

మోకాళ్ల మీద కూర్చొని :

ఈ భంగి మలో వీపుభాగం నిటారుగా ఉం టుంది. ఇప్పుడు చేతుల్ని నేలకు ఆనించి, కాళ్లను వెనక్కి జరపాలి. అవసరమైతే మోళ్ల కింద దిండు పెట్టుకుని స్ట్రెచ్‌ చేయొచ్చు.