ధనదాహంతో గెలిచేందుకు నారా లోకేష్ యత్నం – ఆళ్ల

ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. మే 13 న పోలింగ్ జారబోతున్నట్లు తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించడం తో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని మొదలుపెట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. అలాగే అధికార – ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కూడా మొదలైంది. ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతివిమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అభ్యర్థి నారా లోకేష్ పై వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సెటైర్లు వేశారు. నారా లోకేశ్‌కు విజయరేఖ లేదని, కొన్ని కొన్ని రాతలు అంతేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంగళగిరి పదాన్ని స్పష్టంగా పలికి ఓట్లు అడగాలని అన్నారు. లోకేశ్ ధనదాహంతో మంగళగిరిలో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, తిప్పికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు ఏపీని సింగపూర్ చేస్తానన్నారని, ఇప్పుడు లోకేశ్ మంగళగిరిని గచ్చిబౌలి చేస్తానని చెబుతున్నారని రామకృష్ణారెడ్డి విమర్శించారు.