డబ్ల్యూహెచ్ఓను బెదిరించిన చైనా!

హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తే.. సాయాన్ని నిలిపేస్తాం..చైనా

WHO

వాషింగ్టన్‌: చైనా కరోనా మహ్మమారి విషయంలో విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)ను హెచ్చరించిదన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) ఈ విషయాన్ని బయటపెట్టింది. జనవరిలో చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని డబ్ల్యూహెచ్ఓ భావించింది. అయితే అదే జరిగితే సహకారాన్ని ఆపేస్తామని డబ్ల్యూహెచ్ఓను చైనా బెదిరించినట్టు ఓకథనంలో పేర్కొంది. దీంతో వైరస్ విషయంలో తాము స్వతంత్రంగానే వ్యవహరించినట్టు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధ్‌నామ్ మధ్య జనవరిలో ఫోన్ సంభాషణ జరిగినట్టు వస్తున్న వార్తలను డబ్ల్యూహెచ్ఓ ఖండించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/