చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

లోయలోకి ప్రైవేట్ టూరిస్ట్ బస్సు బోల్తా: 10 మంది మృతి

Road accident in Chittoor district
Road accident in Chittoor district

Tirupati : చిత్తూరు జిల్లాలో ఆదివారం తెల్లవారు ఝామున ఘోర ప్రమాదం జరిగింది. తిరుప‌తి కి సమీపంలో ఉన్న బాకారాపేట ఘాట్‌రోడ్డులో ఒక పెళ్లి బ‌స్సు బోల్తా కొట్టి సుమారు 100 అడుగుల లోతులో కిందకు ప‌డిపోయింది. ఈ ఘటనలో ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం దాదాపు 10మందికి పైగానేమృతి చెంది ఉంటార‌ని తెలుస్తోంది .

బ‌స్సులో 56 మంది ఉన్న‌ట్టు సమాచారం . ధ‌ర్మ‌వ‌రం నుంచి తిరుప‌తికి బ‌య‌లుదేరి వ‌స్తున్న ఈ ప్రైవేటు బ‌స్సు ప్రమాదంపై స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన త‌ర‌లి వ‌చ్చారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం, అతివేగ‌మే ప్ర‌మాదానికి కార‌ణమ‌ని కొందరు ప్ర‌యాణికులు చెబుతున్నారు .


తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/