జగనన్న బీరు పండుగ ఘనంగా ప్రారంభమైంది

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌

nara lokesh
nara lokesh

అమరావతి: ఏపిలో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దీనితో మద్యం షాపుల ముందు జనాలు బారులు తీరారు. పలుచోట్ల ఒకరినొకరు తోసుకుంటు నిల్చున్నారు. ఈ వ్యవహరంపై టిటిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పందిస్తూ.. ఏపిలో కరోనా విజృంభిస్తున్న వేళ జగనన్న బీరు పండుగ ఘనంగా ప్రారంభమయింది అంటూ ఎద్దేవా చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో వైయస్‌ఆర్‌సిపి ఎలుకలు తాగిన కోట్ల రూపాయల మద్యం లెక్కలు సరి చేసేందుకే లిక్కర్‌ అమ్మకాలకు పచ్చజెండా ఊపారని ఆరోపించారు. దేశంలో మద్యం అమ్మకాలకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో ఈ రోజు ఏపిలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/