ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంట విషాద ఛాయలు

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంట విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఆయన తల్లి థెరీసమ్మ (85) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె ఉపాధ్యాయురాలిగా బాధ్యతలను నిర్వహించారు.

కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఉన్న డాక్టర్ ఆదిమూలపు శామ్యూల్ జార్జి విద్యా సంస్థలకు ఆమె ఛైర్ పర్సన్ గా కూడా ఉన్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు మార్కాపురంలో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు. మరోవైపు తన తల్లి మృతి నేపథ్యంలో ఆదిమూలపు సురేశ్ కు పార్టీలకు అతీతంగా పలువురు నేతలు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.