ఉక్రెయిన్ – రష్యా యుద్ధం : కేంద్ర కేబినెట్‌తో మోడీ అత్యవసర సమావేశం

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ – రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర కేబినెట్ మంత్రులతో అత్యవసర సమావేశం కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొంటారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోడీ మాట్లాడాలని ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

కాగా, ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడివ‌ల్ల భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ ఎలా ప్ర‌భావితం అవుతుంది? దానిని ఎదుర్కోవ‌డం ఎలా? అన్న అంశాల‌పై ఈ స‌మావేశం చ‌ర్చిస్తుంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. బంగారం ధ‌ర‌ల పెరుగుద‌ల‌, చ‌మురు ధ‌ల‌ర పెరుగుద‌ల‌, స్టాక్ మార్కెట్ల ప‌త‌నం.. ఈ అంశాల‌న్నీ చ‌ర్చ‌కు రానున్న‌ట్లు స‌మాచారం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/