భర్తకు ఘాటైన లిప్ లాక్ ఇచ్చిన కాజల్

చందమామ ఫేమ్ కాజల్..తన భర్త కు ఘాటైన లిప్ లాక్ ఇస్తూ ఆ ఫోటో ను అభిమానులకు పంచుకుంది. లక్ష్మి కళ్యాణం మూవీ తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన కాజల్..చందమామ , మగధీర సినిమాలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా యంగ్ హీరోల కు జోడిగా నటించి అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లింది. కెరియర్ పిక్ లెవల్లో ఉండగానే వ్యాపార వేత్త గౌతమ్‌ కిచ్లును వివాహం చేసుకొని షాక్ ఇచ్చింది. 2020లో వివాహం చేసుకున్న ఈ జంట ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

ఈ క్రమంలోనే తాజాగా క్రిస్మస్‌ సందర్భంగా కుమారుడు, భర్తతో దిగిన ఫొటోను కాజల్‌ షేర్‌ చేసింది. గౌతమ్‌ కుమారుడిని ఎత్తుకోగా, మరో వైపు కాజల్‌ భర్తకు ముద్దు ఇస్తుండగా తీసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోతో పాటు.. ఈ క్రిస్మస్‌కు నేరు కోరుకుంటోన్న ప్రేమ ఇదేనంటూ ఎమోషనల్‌ క్యాప్షన్‌ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.