పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త

మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులా..అయితే ఈ వార్త మీకోసమే. బ్యాంకుల్ని విలీనం చేసుకున్న బ్యాంకులు ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్నాయి. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు ఓ సూచనా తెలియజేసింది. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (OBC), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) పాత చెక్ బుక్స్ ఇక పని చెయ్యవు అని పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెల్లడించింది. కనుక ఇంకా ఆ బ్యాంక్ చెక్ బుక్స్ వాడుతూ ఉంటే మార్చుకోండి. eOBC, eUNI పాత చెక్ బుక్స్ 2021 అక్టోబర్ 1 నుంచి పని చేయవని, వాటిని పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్ బుక్స్‌ తో అప్‌డేట్ చేయాలని తెలిపింది.

ఐఎఫ్‌ఎస్‌సీ, ఎంఐసీఆర్‌ తో కొన్న కొత్త చెక్ బుక్స్ తీసుకోవాలని పాత ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు తెలిపింది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త చెక్ బుక్స్ మాత్రమే ఉపయోగించాలి. కనుక ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, పీఎన్‌బీ వన్, కాల్ సెంటర్ ద్వారా కూడా కొత్త చెక్ బుక్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.