ఆంధ్ర ప్రదేశ్ లో జడ్పీటీసీ , ఎంపిటిసి ఎన్నికల రద్దు : హైకోర్టు తీర్పు
కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశం

Amaravati: ఆంధ్రప్రదేశ్ లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 8న జరిగిన పరిషత్ ఎన్నికలను రద్దు చేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారించిన కోర్టు.. సుదీర్ఘ విచారణ అనంతరం శుక్రవారం తీర్పు వెల్లడించింది. సుప్రీం సూచించిన నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగలేదని హైకోర్టు అభిప్రాయపడింది.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/