బాహుబలిని ఫాలో అవుతున్న పుష్ప

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్లు ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను ఓ రేంజ్‌లో క్రియేట్ చేశాయి.

అయితే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా దర్శకుడు సుకుమార్ అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాను బాహుబలి బాటలో తీసుకెళ్లేందుకు బన్నీ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమా కథ అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా థ్రిల్ అవుతారని సుకుమార్ అండ్ టీమ్ భావిస్తోంది.

అందుకే ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని వారు అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్‌లో మనకు ఇప్పటికే కనిపించాడు. కాగా ఈ సినిమాలో ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోండగా, మలయాళ నటుడు ఫహాద్ ఫాసిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమా బాహుబలి బాటలో వెళ్లి బాహుబలి రికార్డులను నిజంగా బద్దలుకొడుతుందో లేదో చూడాలి.