మనీశ్ సిసోడియా జ్యూడిషియల్ కస్టడీ పొడిగింపు

సీబీఐ కేసులో 27 వరకు, ఈడీ కేసులో 29 వరకు పొడింగిపు

manish-sisodia-judicial-custody-extended

న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మధ్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యూడిషియల్ కస్టడీని రోస్ అవెన్యూ కోర్టు సోమవారం నాడు పొడిగించింది. సీబీఐ కేసుకు సంబంధించి జ్యూడిషియల్ కస్టడీని ఏప్రిల్ 27వ తేదీ వరకు, ఈడీ కేసుకు సంబంధించి ఏప్రిల్ 29వ తేదీ వరకు పొడిగించింది న్యాయస్థానం. నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కూడా సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయనను విచారణ సంస్థ తొమ్మిది గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. మద్యం కుంభకోణం కేసులో సీబీఐ ఫిబ్రవరి నెలలో సిసోడియాను అరెస్ట్ చేసింది. అంతకుముందు పలుమార్లు ఆయనను విచారించిన అనంతరం అతనిని అదుపులోకి తీసుకున్నది. విచారణకు ఆయన సహరించడం లేదని, సరైన సమాధానాలు చెప్పడం లేదని చెబుతూ, ఆయన ముందు సాక్ష్యాలు పెట్టి విచారించినప్పటికీ సరైన సమాధానం చెప్పడం చెబుతూ సీబీఐ అరెస్ట్ చేసింది.

ఆ తర్వాత మార్చి నెలలో ఈడీ మనీలాండరింగ్ కేసులో అతనిని అదుపులోకి తీసుకున్నది. అతనిని ఈడీ తీహార్ జైల్లో విచారించింది. సిసోడియాను అరెస్ట్ చేసిన తర్వాత నాడు కేజ్రీవాల్ కేంద్రాన్ని తప్పుబడుతూ ట్వీట్ కూడా చేశారు. ‘మనీష్ సిసోడియాను ఇంతకు ముందు సీబీఐ అరెస్ట్ చేసింది. కానీ ఏ ఆధారాలు దొరకలేదు. సోదాల్లోను డబ్బులు గుర్తించలేదు. సీబీఐ అరెస్ట్ కు సంబంధించి రేపు ఆయన బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగనున్నది. ఇలాంటి సమయంలో ముందే ఈడీ అరెస్ట్ చేసింది. అంటే ఇక్కడ ఉద్దేశ్యం ఏమంటే తప్పుడు కేసుల ద్వారా సిసోడియాను జైల్లో ఉంచాలని భావిస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కచ్చితమైన సరైన విధంగా బుద్ధి చెబుతారు’ అంటూ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసిన సమయంలో కేజ్రీ ట్వీట్ చేశారు.