ప్రభుత్వ వాహనాలపై స్టిక్కర్లు అంటించడంఫై ప్రజలు ఆగ్రహం

ఏపీలో ప్రస్తుతం స్టిక్కర్ల హడావిడి మొదలైంది. ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అంటూ వైస్సార్సీపీ ప్రభుత్వం ఇంటింటికి స్టిక్కర్ల అంటించే పని పెట్టుకుంటే..ప్రతిపక్షపార్టీలు జగన్ స్టిక్కర్లకు కౌంటర్ గా తమ పార్టీల స్టిక్కర్లను అంటిస్తునారు. ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అంటూ వైస్సార్సీపీ ఇంటింటికీ వెళ్లి స్టిక్కర్లు అంటిస్తుంటే.. అందుకు ప్రతిగా జనసేన పార్టీ ‘మాకు నమ్మకంలేదు జగన్‌, మా నమ్మకం పవన్‌’ అనే స్టిక్కర్లను వైస్సార్సీపీ స్టిక్కర్ల పక్కనే అంటిస్తూ నిరసన చేస్తున్నారు. ఇక టీడీపీ సైతం సైకో పోవాలి, సైకిల్ రావాలి- మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలంటూ స్టికర్లు అంటిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న..ప్రభుత్వ వాహనాలపై వైస్సార్సీపీ శ్రేణులు స్టిక్కర్లు అంటించడంఫై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గతంలోనూ పంచాయితీలకు, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులద్దడంపై హైకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రభుత్వ వాహనం AP39UE 9 నెంబర్ ఇన్నోవా కారుకు మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్లు అతికించారు. ఓ వైపు ప్రభుత్వ వాహనం అని పేర్కుంటూనే మా నమ్మకం నువ్వే జగన్ అంటూ స్టిక్కర్లు వేసేస్తుండడంపై తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తున్నాయి. పార్టీ కార్యక్రమాలను ప్రభుత్వ వాహనాలపై ప్రచారం చేయడం పట్ల విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.