విశాఖకు పరిపాలనా రాజధాని.. విజయసాయిరెడ్డి

స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో సీఎం తీర్మానం

అమరావతి: వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిన్న చేపట్టిన బంద్ విజయవంతమైందని వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేస్తారని పేర్కొన్నారు. విశాఖ మునిసిపల్ ఎన్నికల్లో వైస్సార్సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి.. విశాఖకు పరిపాలనా రాజధాని రావడం ఖాయమని తేల్చి చెప్పారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖ పరిపాలన రాజధాని కాకుండా చంద్రబాబు అడ్డుకోలేరని పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/