తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ ..

srivari-hundi-income

జులై నెలలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ సాధించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ప్రతి నెలా హుండీ ఆదాయం రూ. 120 కోట్లు దాటుతుంటాయి.. అయితే ఈసారి జులై నెలలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చిందన్నారు. 29 రోజులకే 131 కోట్ల 76 లక్షలు వచ్చాయని తెలిపారు. ఈ ఆదాయం గత రికార్డులను తిరగరాసి ఆల్ టైమ్ రికార్డ్ నమోదు చేసినట్లు చెప్పుకొచ్చారు.

రెండేళ్లుగా కరోనా కారణంగా భక్తులెవరు శ్రీవారిని దర్శించుకోలేకపోయారని , ప్రస్తుతం కరోనా ఉదృతి తగ్గడం తో గత నాల్గు , ఐదు నెలలుగా భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారని అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనానికి 48 గంటల సమయం పడుతుందని , రద్దీతో పాటు శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరిగిందని చెప్పుకొచ్చారు. నగదు, నగలు వస్తు రూపంలో స్వామి వారికి ముడుపులు చెల్లించుకోవడంతో శ్రీవారి హుండీలో కాసుల వర్షం కురుస్తుందని తెలిపారు.