మళ్లీ రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్‌లో విజయసాయి రెడ్డికి చోటు..

vijayasai reddy
vijayasai reddy

న్యూఢిల్లీ : వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ లో చోటుదక్కింది. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్.. సోమవారం రాజ్యసభ ప్యానల్ జాబితాలో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా నరేంద్రమోడీ , ప్రల్హాద్ జోషికి ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ 19, 2022న తనను వైస్-ఛైర్మెన్ ప్యానెల్‌కి తిరిగి నామినేట్ చేసినందుకు ధన్యావాదాలు తెలిపారు. రాజ్యసభ సభ్యులు సంతృప్తి చెందేలా సభ సజావుగా జరిగేలా చూసేందుకు ప్రయత్నిస్తానంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.