తాలిబన్ల ఎఫెక్ట్..హైద్రాబాద్ బిర్యానీ ఫై పడింది

హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టపడనివారుండరు. మన వారే కాక విదేశీయులు సైతం ఎంతో ఇష్టంగా తింటుంటారు. అలాంటి బిర్యానీ ప్రియులకు షాకింగ్ న్యూస్..హైదరాబాద్ లో బిర్యానీ ధర భారీగా పెరిగింది. దీనికి కారణం అఫ్ఘానిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకోవడమే. దానికి ..దీనికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా..బిర్యానీ లోకి వాడే మసాలా దినుసులు అఫ్ఘానిస్తాన్ నుండే సరఫరా అవుతుంటాయి. అఫ్ఘానిస్తాన్ కు చెందిన వారు హైదరాబాద్ లో ఉంటూ మసాలా దినుసుల వ్యాపారం చేస్తున్నారు.

ఇప్పుడు ఆ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకోవడంతో ఇండియాకు దాదాపు దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో వాటి ధరలు పెరగడంతో రెస్టారెంట్ల యజమానులు సైతం బిర్యానీ ధరను ఏకంగా రూ.100కి పైగా పెంచేశారు. హైదరాబాద్‌లో గతంలో బిర్యానీ ప్లేట్ ధర రూ.250 వరకు ఉండగా.. ఇప్పుడు రూ.350వరకు పెరిగింది. నెల రోజుల క్రితం జంబో ప్యాక్ ధర రూ.600 ఉండగా.. రెస్టారెంట్లను బట్టి రూ.700-800 వరకు పెరిగింది. రూ.400 ఉండే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ధర రూ.550 వరకు పెంచేశారు. ఇక ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకునే వారికీ ఇంకాస్త ధరలు పెరగనున్నాయి. మొత్తం మీద తాలిబన్ల ఎఫెక్ట్ హైదరాబాద్ బిర్యానీ ఫై పడిందని అంత మాట్లాడుకుంటున్నారు.