11 మంది వైకాపా ఎమ్మెల్సీ లు ఏకగ్రీవ ఎన్నిక

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గెజిట్‌ నోటిఫికేషన్‌

YSRCP MLC candidates win
YSRCP MLC candidates win

అమరావతి: స్థానిక సంస్థల కోటాలో 11 మంది వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థులు విజయం సాధించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. 8 జిల్లాల నుంచి 11 ఎమ్మెల్సీ స్థానాలకు నవంబర్‌ 16న గవర్నర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురం నుంచి యల్లారెడ్డిగారి శివరామిరెడ్డి, కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురామ్, మొండితోక అరుణ్‌కుమార్, తూర్పుగోదావరి నుంచి అనంత సత్యఉదయ్‌భాస్కర్, గుంటూరు నుంచి డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు, విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు, విశాఖపట్నం నుంచి వరుదు కళ్యాణి, చెన్నుబోయిన శ్రీనివాసరావు, చిత్తూరు నుంచి కృష్ణరాఘవ జయేంద్రభరత్, ప్రకాశం నుంచి తూమాటి మాధవరావులు ఎన్నికైనట్టు నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/