రఘురామకృష్ణరాజుపై ఎమ్మెల్యే‌ ఫిర్యాదు

మమ్మల్ని రఘురామకృష్ణరాజు ‘పందులు’ అని అన్నారు

MP Raghu Rama Krishna Raju

ఏలూరు: వైఎస్‌ఆర్‌సిపి రెబల్‌ ఎంపి రఘురామకృష్ణరాజు పై భీమవరం వన్ టౌన్ పీఎస్‌లో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. తనను, తన సహచర ఎమ్మెల్యేలను పందులు అంటూ కించపరిచేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా చేసారని గ్రంధి శ్రీనివాస్ ఆరోపించారు. తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా ప్రవర్తించిన ఎంపి రఘురామ కృష్ణరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భీమవరం  జిల్లా ఎస్పీకి కూడా నిన్న రాత్రి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. కాగా నిన్న పోడూరు పీఎస్‌లో ఇదే రీతిలో మంత్రి రంగనాథరాజు ఫిర్యాదు చేశారు. హైకమాండ్ ఆదేశాలతోనే ఎంపిపై ఫిర్యాదులు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/