మహిళా కానిస్టేబుల్‌ పట్ల దురుసుగా ప్రవర్తించిన వైస్సార్సీపీ నేత కుమారుడు

పల్నాడు జిల్లా ముప్పాళ్ల గ్రామ వైస్సార్సీపీ వార్డ్ మెంబర్ కొడుకు కోటిరెడ్డి ..పీకలదాకా తాగి సచివాలయంలో నానా బీబత్సం చేసాడు. తాగిన మత్తులో సచివాలయంలో సిబ్బందిపై కేకలు వేస్తూ రెండు కంప్యూటర్లతో పాటు ప్రింటర్‌ను ధ్వంసం చేశాడు. అక్కడితో ఆగకుండా రివర్స్‌లో సచివాలయ సిబ్బంది‌పైనే ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడితో ఆగకుండా మహిళా కానిస్టేబుల్‌ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. రూల్స్ తెలుసా అంటూ పోలీసులపై చిందులు తొక్కాడు.

మీడియాను పిలుస్తానంటూ బెదిరించారు. వెంటనే మహిళా కానిస్టేబుల్ ప్రతిఘటించారు.. కోటిరెడ్డిని అదుపు చేసి సచివాలయ సిబ్బంది ఫిర్యాదుతో చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోను టీడీపీ ట్వీట్ చేసింది. ‘వైస్సార్సీపీ వార్డ్ మెంబర్ కొడుకు మహిళా కానిస్టేబుల్ తో ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి. కోటిరెడ్డి అనే ఇతగాడు దీనికి ముందు ముప్పాళ్ళ సచివాలయ సిబ్బందిపై దాడిచేసి రెండు కంప్యూటర్లు, ప్రింటర్ ధ్వంసం చేసాడు. తిరిగి సిబ్బంది పైనే ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఇలా రెచ్చిపోయాడు’అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.