‘వైఎస్సార్‌ మత్స్యకార భరోసా’ ప్రారంభం

లబ్దిదారుల బ్యాంక్‌ ఖాతాలకు నేరుగా నగదు జమ చేసిన సీఎం వైఎస్ జగన్

‘వైఎస్సార్‌ మత్స్యకార భరోసా' ప్రారంభం
AP CM YS Jagan in ‘ysr matsyakara bharosa’ launching

Amaravati: రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చే ‘వైఎస్సార్‌ మత్స్యకార భరోసా’ పథకాన్ని మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలకు నేరుగా నగదు జమ చేశారు. అనంతరం సిఏం మాట్లాడారు. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు అండగా ఉండేందుకే వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టమని తెలిపారు.

1,19,875 మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో మత్స్యకారులను ఆదుకున్నవారే లేరని అన్నారు. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మత్స్యకారులు మృతి చెందితే రూ.10 లక్షల చొప్పున వారి కుటుంబాలకు ఇస్తున్నామని వెల్లడించారు. ఈ పథకం కింద 1,19,875 కుటుంబాలకు రూ.10వేల చొప్పున రూ.119,87,50,000 మేర లబ్ధి కలగనుంది. ఇక గడచిన రెండేళ్లలో మత్స్యకారులకు రూ.211.71 కోట్ల మేర లబ్ధి కలిగింది. ఈ ఏడాది మరో రూ.119.87 కోట్లతో కలిపి మూడేళ్లలో రూ.331.58 కోట్ల మేర లబ్ధి చేకూరుటుందని సీఎం జగన్ వివరించారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/