ఆర్మీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు

సాయంత్రం మెడికల్ రిపోర్ట్ వచ్చే అవకాశం

mp raghurama-Medical tests at Army Hospital
mp raghurama-Medical tests at Army Hospital

Secunderabad: సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రిలో ఎంపీ రఘురామకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. . ఇప్పటికే రఘురామ రక్త నమూనాలను వైద్య బృందం సేకరించింది. జ్యుడీషియల్ అధికారి నేతృత్వంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు రక్త నమూనాలను వైద్య బృందం ల్యాబ్‌కు పంపింది. ఈ తంతును మొత్తం వీడియో గ్రఫీ చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం మెడికల్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉందని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 21 వరకు ఆర్మీ ఆసుపత్రిలో రఘురామకు చికిత్స అందిస్తారు. అదే రోజు మొత్తం నివేదికను సీల్డ్‌కవర్‌లో జ్యుడిషియల్ అధికారి సుప్రీంకోర్టుకు అందజేయనున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/