రైతులు తిరగబడక ముందే పంట మొత్తం కొనాలి : షర్మిల

చివరి గింజ వరకు కొంటానని కేసీఆర్ చెప్పారు

హైదరాబాద్ : సీఎం కెసిఆర్ పై వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. ఇది పంటలు వేసుకునే యాసంగి కాలం అని చెప్పిన మీకు… ఆ కాలం కూడా వెళ్లిపోతుందని తెలియడం లేదా దొరా? అని ఆమె ప్రశ్నించారు. పంట వేసుకోవాల్సిన రైతు ఇంకా వానాకాలం పంట అమ్ముడుపోక, కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నాడని ఆమె అన్నారు.

చివరి గింజ వరకు కొంటామని చెప్పిన మాటల మొనగాడు ఇప్పటి వరకు 30 శాతం మాత్రమే కొన్నాడని ఎద్దేవా చేశారు. ధాన్యం కొంటాడో, కొనడో తెలియక ధాన్యం కుప్పల మీదే రైతు గుండెలు ఆగిపోతుంటే కేసీఆర్ మాత్రం ధాన్నాన్ని కొనకుండా రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. ఇప్పటికే రెండు నెలలుగా వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ రైతులు గోస పడుతున్నారని అన్నారు. రైతులు తిరగబడక ముందే పంట మొత్తం కొనాలని… లేకపోతే కేసీఆర్ మూట ముళ్లె సర్దుకోవాల్సిందేనని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/