పార్లమెంట్ నుండి టిఆర్ ఎస్ ఎంపీలు వాకౌట్
రైతుల్ని కాపాడాలంటూ నినాదాలు ..
parliament-trs-mps-walkout-delhi-farmers
న్యూఢిల్లీ : టిఆర్ ఎస్ ఎంపీలు పార్లమెంట్ ఉభయసభల నుంచి వాకౌట్ చేశారు. రైతుల పట్ల కేంద్రం మొండివైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నామని చెప్పారు. స్పీకర్ ని చుట్టు ముట్టి నినాదాలు చేశారు. రైతుల్ని కాపాడాలని ప్లకార్డులు ప్రదర్శించారు. సమగ్ర జాతీయ ధాన్య సేకరణ విధానం తీసుకు రావాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. కేంద్రం ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. రబీ ధాన్యం సేకరణ సమస్యను పరిష్కరించాలని అన్నారు. ఈ క్రమంలోనే ఉభయ సభల నుంచి టీఆర్‌ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు.
తాజా ఆంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/