దేవరకొండ బస్తీరోడ్ నంబర్ 3లో యువతి కిడ్నాప్

బైక్‌‌లపై వచ్చి యువతిని తీసుకెళ్లిన దుండగులు

Young woman kidnapped at Devarakonda Basti Road No. 3
Young woman kidnapped at Devarakonda Basti Road No. 3

Hyderabad: హైదరాబాద్‌లో యువతి కిడ్నాప్ నకు గురికావటం సంచలనం రేపింది. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దేవరకొండ బస్తీ రోడ్ నంబర్ 3లో రాత్రి 10 గంటల సమయంలో ముగ్గురు దుండగులు బైక్‌‌లపై వచ్చి యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. యువతి గట్టిగా కేకలు వేసింది. స్థానికులు అప్రమత్తమయ్యేలోగానే కిడ్నాపర్లు ఆమెను తీసుకుని పరారయ్యారు.

స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాప్రదేశాన్ని పరిశీలించారు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి దానిపై ఆరా తీస్తున్నారు. తెలిసిన వారి పనేనా? లేక ఏదైనా ముఠా హస్తం ఉందా? అన్న కోణంలోకూడా విచారణ చేపట్టారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/