దీపాలి చవాన్ ఆత్మహత్య కేసులో : ఐఎఫ్ఎస్ అధికారి సస్పెన్షన్

ఉత్తర్వులు జారీ చేసిన మహారాష్ట సర్కార్

Deepali Chavan suicide case: IFS officer suspended
Deepali Chavan -File

Mumbai: మహారాష్ట్ర అటవీ అధికారిణి దీపాలి చవాన్ ఆత్మహత్య కేసులో ఐఎఫ్ఎస్ అధికారి, మెల్గాట్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటువేసింది., ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో నిన్న శిశు సంక్షేమశాఖ మంత్రి యశోమతి ఠాకూర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీపాలి కేసుపై చర్చించారు. శ్రీనివాసరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

దీంతో శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ అధికారి వినోద్ శివకుమార్ తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ దీపాలి పలుమార్లు శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించినట్టు దీపాలి నాలుగు పేజీల సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.ఈ కేసులో ప్రధాన నిందితుడైన శివకుమార్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/