జూనియర్ ఆర్టిస్టును గర్భవతిని చేసిన యువ నటుడు

చిత్రసీమలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో జూనియర్ ఆర్టిస్టును యువ నటుడు గర్భవతిని చేసిన ఘటన ఇప్పుడు తెలుగు చిత్రసీమలో చర్చగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న యువతి (25)కి, వర్ధమాన నటుడు ప్రియాంత్‌రావు(30)తో ప్రేమాయణం ఏర్పడింది. ఆపై పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. దీంతో గత జనవరిలో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ప్రియాంత్‌రావుకు చెబితే గర్భవిచ్ఛిత్తి మాత్రలు ఇచ్చి వేసుకోమన్నాడు. అయితే, ఆ తర్వాత అతడికి వివాహమై కుమార్తె కూడా ఉందన్న విషయం తెలుసుకున్న యువతి నిలదీసింది. దీంతో ఆమెకు విడాకులు ఇవ్వబోతున్నట్టు చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు. యువతి ఇటీవల మరోమారు అతడి వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకురాగా చంపేస్తానని బెదిరించినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో యువతి పేర్కొంది. బాధిత యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ప్రియాంత్‌రావును అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రియాంత్‌రావు నటించిన ‘కొత్తగా మా ప్రయాణం’ మూవీ విడుదల కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ప్రియాంత్‌రావు అరెస్ట్ కావడం యూనిట్ ను షాక్ కు గురి చేసింది.