కియా ఫ్యాక్టరీ ముందు నారా లోకేష్ సెల్ఫీ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఈరోజు 55 వ రోజు పెనుకొండ నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఉదయం పెనుకొండ క్రాస్ క్యాంప్ సైట్‌లో స్థానికులతో సెల్ఫీలు దిగిన లోకేష్.. అనంతరం అక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. హరిపురంలో స్థానికులతో మాట్లాడి.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మునిమడుగు కియా ఫ్యాక్టరీ వద్ద ఉద్యోగులతో మాట్లాడి అక్కడ సెల్ఫీ తీసుకున్నారు. కియా పరిశ్రమ ఇది.. ఏపీలోనే అతిపెద్ద సింగిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్.. భారతదేశంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పెట్టిన సంస్థ అన్నారు. పెట్టుబడి రూ.13వేల కోట్లు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 40వేల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఏడాదికి నాలుగు లక్షల వాహనాలు తయారవుతాయన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌కి ఇలాంటి కంపెనీని తీసుకురావాలని మీరు కలలో కూడా ఊహించలేరు వైఎస్ జగన్’ అంటూ ట్వీట్ చేశారు.