మాజీ సీఎం యెడియూరప్ప మనవరాలు ఆత్మహత్య

ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సౌందర్య

బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్ప ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మనవరారు సౌందర్య నీరజ్ (30) ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరులోని వసంతనగర్ లోని అపార్ట్ మెంటులో నివసిస్తున్న ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. బెంటళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో ఆమె వైద్యురాలిగా పని చేస్తున్నారు. యెడియూరప్ప పెద్ద కుమార్తె పద్మ కూతురే సౌందర్య.

2019లో డాక్టర్ నీరజ్ తో ఆమె వివాహం జరిగింది. వీరికి ఒక పాప కూడా ఉంది. పని మనిషి ఈ ఉదయం 10 గంటలకు సౌందర్య ఇంటికి వెళ్లి తలుపు తట్టగా… ఎంత సేపటికీ తలుపు తెరుచుకోలేదు. దీంతో, వెంటనా నీరజ్ కు ఫోన్ చేశారు. హుటాహుటిన నీరజ్ ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత తలుపులను తెరిచి లోపలకు వెళ్లగా సీలింగ్ ఫ్యాన్ కు ఆమె వేలాడుతూ కనిపించింది. ప్రాథమిక ఆధారాలను బట్టి కేసును ఆత్మహత్యగా పోలీసులు నమోదు చేశారు. మరోవైపు కుటుంబ కలహాల నేపథ్యంలో గత కొంత కాలంగా సౌందర్య డిప్రెషన్ లో ఉందని తెలుస్తోంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/