ఎలక్షన్ వస్తే వేలకు వేలు ఇస్తారు.. కష్టం వస్తే బిచ్చం వేస్తారా అంటూ జగన్ ఫై బాబు ఫైర్

ఎలక్షన్ వస్తే వేలకు వేలు ఇస్తారు.. కష్టం వస్తే బిచ్చం వేస్తారా అంటూ జగన్ ఫై బాబు ఫైర్

రాయలసీమ వరద బాధిత ప్రాంతాలలో మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తూ బాధితులకు భరోసా అందజేస్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నెల్లూరులోని వెంకటేశ్వరపురం గాంధీ గిరిజన కాలనీలో ముంపు ప్రాంత ప్రజలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించి సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. ఎలక్షన్ వస్తే మాత్రం వేలు పెట్టి కొంటారు.. కష్టం వస్తే బిచ్చం వేసినట్టు రెండు వేల ఇచ్చారు.. అంటూ వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

కష్టాల్లో ప్రజలున్నప్పుడు.. పాదయాత్రలో ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రి ఎక్కడున్నాడని చంద్రబాబు ప్రశ్నించారు. అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చాడని, మద్యం బాగా అమ్మి ఆదాయం వస్తే అమ్మ ఉడి ఇస్తాడట అని విమర్శలు గుప్పించారు. రాబోయే రోజుల్లో గంజాయి అమ్మి.. మీ పిల్లల చేత తాగించి.. సంక్షేమ పథకాలు ఇస్తాడు అంటూ జగన్ ఫై విరుచుకపడ్డారు. 27, 28, 29 తేదీల్లో మరో తుఫాన్ వస్తుందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముందస్తు జాగ్రత్తలు తెలిపారు. ప్రమాదానికి కారణమైన తెగిన కరకట్టకు వెంటనే మరమ్మత్తులు చేయాలని, లేదంటే విపత్తు మరింత ఎక్కువగా ఉంటుందని చంద్రబాబు అన్నారు.