పట్టాభికి చంద్రబాబు నుండి ప్రాణహాని – ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం నేత పట్టాభికి చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉందని ..ఈ విషయంలో పట్టాభి కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేసారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. రాజకీయ లబ్ధి కోసం ఎన్నో చేసిన చంద్రబాబు..ఇప్పుడు పట్టాభి ని హత్య చేసి..ఆ నేరం వైసీపీ పార్టీ మీదకు తోచి , సానుభూతి పొందాలని చూస్తున్నారని చంద్రశేఖర్ అన్నారు. ఈ విషయంలో పట్టాభి కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ప్రస్తుతం పట్టాభి అజ్ఞాతంలోకి వెళ్లారు. రీసెంట్ గా ఈయన వైసీపీ అధినేత , ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈయన ను పలు సెక్షన్ల కింద అరెస్ట్ చేసారు. అయితే శనివారం బెయిల్ ఫై బయటకొచ్చిన పట్టాభి..జైలు నుండి ఇంటికి వెళ్లకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసులు ఎక్కడ మరో కేసు పెట్టి అరెస్ట్ చేస్తారో అని ఎవరికీ తెలియని చోట కు వెళ్లినట్లు చెపుతున్నారు.

మరోపక్క పట్టాభి ఇంటిపై దాడి కేసులో పోలీసులు మరో ఏడుగురు నిందితులను గుర్తించి, విచారించారు. నిందితులకు 41ఏ సెక్షన్‌ కింద పటమట పోలీసులు నోటీసులు జారీ చేశారు. అరెస్టైన వారిలో నలుగురు విజయవాడ వాసులు కాగా, ఇద్దరు గుంటూరుకు చెందిన వారు ఉన్నారు. విజయవాడకు చెందిన జోగరాజు, షేక్‌ బాబు, షేక్‌ సైదా, సూర్య సురేష్‌, గుంటూరుకు చెందిన మోహన్‌ కృష్ణారెడ్డి, గురవయ్యలను అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు గుంటూరు అర్బన్‌ ఎస్పీ కార్యాలయం తెలిపింది.