అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన యశోద

యశోద సూపర్ హిట్ చేసిన అభిమానులకు సమంత ధన్యవాదాలు తెలిపింది. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యశోద మూవీ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు మొదటి ఆట తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. హ‌రీష్ శంక‌ర్‌, హ‌రీష్ నారాయ‌ణ్ సంయుక్తంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదలైంది. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు , అభిమానులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ చిత్ర యూనిట్ కు కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. ఇప్పటికే మేకర్స్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపగా..తాజాగా సమంత సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు ధన్యవాదాలు తెలిపింది.

“ప్రియమైన ప్రేక్షకులకు ‘యశోద’ పై మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు. మీ ప్రశంసలు, మీరు ఇస్తున్న మద్దతు చూస్తున్నాను. ఇదే నాకు లభించిన గొప్ప బహుమతి. సినిమాకు వస్తున్న స్పందన నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది.’యశోద’ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్లలో మీ సంబరాలు చూశాను. సినిమా గురించి మీరు చెప్పిన మాటలు విన్నాను. దీని వెనుక మా చిత్ర బృందం అహర్నిశలు నిర్విరామంగా పడ్డ కష్టం ఉంది. ఇప్పుడు నా మనసు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. ‘యశోద’ మీ ముందుకు రావడానికి కారణమైన వాళ్ళకు, ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకు ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నాను.

నా పైన, ఈ కథపైన నమ్మకం ఉంచిన నిర్మాత, శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్ గారికి కృతజ్ఞతలు. దర్శకులు హరి, హరీష్‌తో పని చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ కథ కోసం ఎంతో రీసెర్చ్ చేశారు.వరలక్ష్మీ శరత్ కుమార్ గారికి, ఉన్ని ముకుందన్ గారికి, మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరితో పనిచేయడం నాకు ఎంతో ఆనందానిచ్చింది” అంటూ..సమంత రాసుకొచ్చింది.