యశోద మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం యశోద. హ‌రీష్ శంక‌ర్‌, హ‌రీష్ నారాయ‌ణ్ సంయుక్తంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీ నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ ఎత్తున జరిగినట్లు తెలుస్తుంది.

ఏసియన్ సినిమాస్ ఈ థియట్రికల్ రైట్స్‌ని కొనుగోలు చేయగా.. తెలుగు రాష్ట్రాల్లో విడుదలకి రూ.12 కోట్లు ఏసియన్ సినిమాస్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఓవర్‌సీస్‌తో కలిపి ఓవరాల్‌గా రూ.22 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. మరో పక్క ‘ఓ బేబీ’ సినిమా తర్వాత సమంత నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ కావడం.. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ వద్ద సమంత భారీ కటౌట్‌ని అభిమానులు ఏర్పాటు చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు.

ఇక సామ్ ఆరోగ్యం విషయానికి వస్తే.. ఇటీవల తనకి ‘మయోసిటిస్’ వ్యాధి ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించడంతో ఆమె అనారోగ్యంతో పాటు యశోద మూవీ గురించి కూడా చర్చ జరిగింది. సెలైన్ సాయంతో యశోద మూవీకి సమంత డబ్బింగ్ చెప్తున్న ఫొటో కూడా వైరల్‌గా మారింది.