పవన్‌ వర్మ కావాలంటే పార్టీ వీడి వెళ్లిపోవచ్చు

ఎవరికైనా సమస్యలు ఉంటే పార్టీ సమావేశాల్లో చర్చించాలి

Nitish Kumar
Nitish Kumar

పాట్నా: జేడీయూ జనరల్‌ సెక్రటరీ పవన్‌ వర్మ బిహార్‌ సీఎంకు బహిరంగ లేఖ రాయడంపై ఆ రాష్ట్రా సీఎం నితీష్‌కూమర్‌ తీవ్రంగా స్పందించారు. పవన్‌ వర్మ తన అసంతృప్తిని వ్యక్తం చేసే మార్గం ఇది కాదని నితీష్‌ పేర్కొన్నారు. ఆయన కావాలంటే పార్టీ వీడి వెళ్లిపోవచ్చని అన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే దాని గురించి పార్టీ సమావేశాల్లో మాట్లాడాలని హితవు పలికారు. అంతే కానీ, ఇలా బహిరంగంగా మాట్లాడకూడదని నితీష్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ వర్మ ఇలా ప్రకటన చేయడం ఆశ్చర్యాన్ని కలిగించదని సీఎం అన్నారు. కాగా ఢిల్లీ ఎన్నికల్లో జేడీయూ బిజెపితో ఎందుకు కలిసి పోటీ చేస్తుందని రెండు రోజుల క్రితం ఆ పార్టీ నేత పవన్‌ బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. సదరు లేఖను ఆయన ట్వీట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ముక్త్‌ భారత్‌ కావాలంటూ మీరే చాలా సార్లు ప్రకటించారు. మరి అలాంటిది బిజెపితో ఎందుకు చేతులు కలిపారని ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ను ఆయన ప్రశ్నించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/