మరోసారి చైనాతో కమాండర్‌ స్థాయి చర్చలు

మరోసారి చైనాతో కమాండర్‌ స్థాయి చర్చలు
India-China Army commanders meet

న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తలను తొలగించేందుకు ఇండియా, చైనా కామండర్స్‌ స్థాయి చర్చలు ఈ వారంలో మరోసారి జరుగనున్నాయి. ఈ నెల 6న లేదంటే 8న చర్చలు జరునున్నట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇంతకు ముందు అక్టోబర్‌ 12న జరిగిన చివరి, అంతకు ముందు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఏప్రిల్‌కు ముందు ఏ పరిస్థితులు ఉండేవో.. అలాంటి వాతావరణాన్నే కల్పించాలని, ఉద్రిక్తతలను తొలగించడానికి చైనానే తొలి అడుగు వేయాలని భారత్‌ తేల్చిచెప్పింది. దీనికి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారులు ఏ మాత్రం అంగీకరించలేదు. పాంగాంగ్‌ దక్షిణ ఒడ్డు నుంచి భారతదేశం మొదట వైదొలగాలని చైనా మొండిగా వాదించింది. దీన్ని భారత్‌ వ్యతిరేకించింది. ఓ వైపు చర్చలంటూనే డ్రాగన్‌ దేశం మరో వైపు యుద్ధ సన్నాహాలు చేస్తోంది. దీంతో మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు దేశాల భూభాగాలపై పెద్ద ఎత్తున సైనికులను వ్యూహాత్మక, సమస్యాత్మక ప్రాంతాల్లో రెండు దేశాలు భారీగా యుద్ధ సామగ్రిని తరలించాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/