యుగ పురుషుని స్మృతికి నివాళులు
కళాకారుడిగా, సమాజ సేవకునిగా, ప్రజానాయకుడిగా చెరగని ముద్ర వేసిన యుగ పురుషుడు ఎన్టీఆర్

అమరావతి: దివంగత నేత ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ఆయనకు నివాళులు ఆర్పించారు. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అనే నూతన భాష్యం ఎన్టీఆర్ ప్రజాస్వామ్యానికి ఇచ్చారని అన్నారు. ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా యుగ పురుషుని స్మృతికి నివాళులు. ఇంకా కళాకారుడిగా, సమాజ సేవకునిగా, ప్రజానాయకుడిగా చెరగని ముద్ర వేసిన యుగ పురుషుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు నాయుడు కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన చైతన్యమూర్తి. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన అన్న. పూరిగుడిసెల స్థానంలో పేదలకు పక్కా ఇళ్లు, అన్న వస్త్రాలు అందించే అనేక సంక్షేమ పథకాల రూపకర్త ఎన్టీఆర్ అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/