మాస్క్ పెట్టలేదని థాయ్‌లాండ్‌ ప్రధానికి ఫైన్

బ్యాంకాక్ గవర్నర్ ఫిర్యాదుతో జరిమానా విధించిన అధికారులు

Fine for Thailand PM not wearing mask
Fine for Thailand PM not wearing mask

థాయ్‌లాండ్‌ ప్రధానమంత్రి జనరల్‌ ప్రయూత్‌ చాన్‌-వో-చా మాస్క్ ధరించని కారణంగా అధికారులు 6 వేల భాట్‌ల (సుమారు రూ.14,270) జరిమానా విధించారు. తాజాగా అధికారులతో సమావేశం సందర్భంగాఆయన మాస్క్ ధరించకపోవటంతో ఈ జరిమానా విధించారు. వ్యాక్సిన్ కొనుగోలుకు సంబంధించి ప్రధాని ప్రయూత్ నిన్న సలహాదారులతో సమావేశంలో ఆయన మాస్క్ ధరించలేదు. దీంతో బ్యాంకాక్ గవర్నర్ అశ్విన్ క్వాన్ ముయాంగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రధానిపై తాను ఫిర్యాదు చేసినట్టు గవర్నర్ తన ఫేస్‌‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ ఐయింది. . ప్రధాని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ నెటిజన్లు మండిపడ్డారు. అధికారులు ఆయనకు జరిమానా విధించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/