వర్క్‌ ఫ్రమ్‌ హోం చేసింది చాలు..ఇక ఆఫీసులకు రండి!

సౌదీ అరేబియా కీలక నిర్ణయం

Work from home-
Work from home-

రియాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కరోనా కట్టడి కోసం వర్క్‌ ఫ్రం హోం విధానాన్ని ఇంకా అమలు చేస్తుంటే సౌదీ అరేబియా మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది.

సౌదీ అరేబియా మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు ఇంటివద్ద నుంచి పనిచేసింది చాలు, ఇక ఆఫీసులకు రండి అంటూ ఉద్యోగులకు సూచించింది.

ఉద్యోగులు ఈ నెలాఖరు వరకు వర్క్‌ ఫ్రం హోం ఆపేయాలని, ఆఫీసుకు వచ్చి పని చేయడం మొదలుపెట్టాలని సూచించింది సౌదీ అరేబియా మానవ వనరుల మంత్రిత్వ శాఖ.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో సౌదీ అరేబియాలోనూ కొన్ని నెలలుగా ఉద్యోగులు ఇళ్ల నుంచి పనిచేస్తున్నారు.

కరోనా వ్యాప్తి పూర్తిస్థాయిలో తగ్గనప్పటికీ, కేసులు నమోదు అవుతున్నప్పటికీ సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది.

ఆగస్టు 30 నుంచి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు గుడ్‌ బై చెప్పి, అందరూ ఆఫీసులకు బయలుదేరండి అంటూ సూచించింది.

ఇళ్ల నుంచి ఎక్కువ కాలం పాటు వర్క్‌ చేయడం మంచిది కాదని మానవ వనరుల శాఖ మంత్రి ఆల్‌ రజీ స్పష్టం చేశారు.

ఇప్పటికే అన్ని విభాగాలకు ఈ సర్క్యులర్స్‌ను జారీచేసి అందరూ ఆఫీసులకు వచ్చి పనిచేయాలని, తాము చేసిన సూచనలు అమలయ్యేలా చూడాలని విభాగాధిపతులను ఆదేశించారు.

అంతేకాకుండా కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా, ఆఫీసుల్లోనూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.

ఆఫీసులలో కరోనా వ్యాప్తి జరగకుండా ఉండడం కోసం వేలిముద్రలతో లాగిన్‌ అయ్యే విధానాన్ని నిలిపివేశారు.

ఒక్క సారిగా అందరూ ఉద్యోగులు ఆఫీస్‌కు రావాల్సిన అవసరం లేదని, ఎవరి అవసరం అయితే ఎక్కువగా ఉంటుందో వారి లిస్టులను తయారు చేసి తదను గుణంగా వారని మాత్రమే పిలిపించి పని చేయించుకోవాలని ఆయన పేర్కొన్నారు.

25 శాతాన్ని మించి ఏ సంస్థలోని ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసే అవసరం లేదంటూ సర్క్యులర్‌ ద్వారా తెలిపారు.

ప్రభుత్వం సూచించిన నియమాలను పాటిస్తూ, ఆఫీసులో పని చేసుకోవాలని సౌదీ అరేబియా మానవ వనరుల శాఖా మంత్రి పేర్కొన్నారు.

ఒకపక్క ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానాన్ని ప్రోత్సహి స్తుంటే సౌదీ అరేబియా మాత్రం ఆఫీసులకు వచ్చి పని చేయాల్సిందే అంటుంది.

ఇక ఇండియాలోనూ ఈ ఏడాది చివరి వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానమే అమలయ్యే పరిస్థితి కనిపిస్తుంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/